ఒక సినిమా హిట్టైనప్పుడు మంచి పేరు వచ్చినప్పుడు అందరిలా మురిసిపోను.. ఆ హిట్‌కు గుర్తింపుకు తాను అర్హురాలినా అని ముందు తనను తాను విమర్శించుకుంటా. అప్పుడే తనలోని విమర్శకురాలు బయటికొస్తుందని సమంత చెప్పింది. ఓ సినిమా హిట్ కావడమో లేకుంటే ఆ సినిమాలోని పాత్రకు మంచిపేరు రావడమో జరిగినప్పుడు తమకష్టం ఫలించిందని లేదా దీన్ని ముందే ఊహించామని కొందరు చెప్తుంటారు. అయితే వారి ఆనందంలో వచ్చే మాటల్లో నిజముండదని చెప్తోంది. సినిమానో, పాత్రో హిట్ అయినప్పుడు.. ఆ పాత్రకు గల ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఏమిటనే దానిపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని సమంత అంటోంది.
అలాగే తమిళంలోనూ విక్రమ్ - సూర్య లాంటి స్టార్ హీరోలతో నటిస్తోంది. ఆ సినిమాలు తెలుగు తెరపైకి ఎలాగో వస్తాయి. విక్రమ్ హీరోగా తెరకెక్కిన 10 ఎంద్రతుకుల్ల ఈ నెలలోనే విడుదల కానుంది. మిగిలిన సినిమాలు వచ్చే ఏడాది క్యూ కట్టనున్నాయి. ఓ రకంగా సమంత రెండు భాషలు కలుపుకుని 4 సినిమాలను సిద్ధం చేస్తున్నట్టే. ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ వేటికవే ప్రత్యేకమని చెప్తోంది.