తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విభిన్న నేపథ్యాలున్న పాత్రలను పోషిస్తూ భారతీయ ప్రేక్షకులు, విమర్శకుల ప్రసంశలతో మంచి పేరు సంపాదించుకుంది సమంతా రూత్ ప్రభు. ఇటీవలే విడుదలైన శాకుంతలం సినిమాలో ఆమె నటనకు అనేక ప్రశంసలు దక్కాయి. గతంలో రాజమౌళి 'ఈగ' సినిమాతో హిట్ కొట్టిన ఆమె, ప్రైమ్ వీడియో యాక్షన్ థ్రిల్లర్ 'ది ఫ్యామిలీ మ్యాన్' రెండో సీజన్ ద్వారా ఓటీటీలో కూడా అరంగేట్రం చేసింది. ప్రస్తుతం 'సిటాడెల్: ఇండియా' చిత్రంలో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది.