ప్చ్... పాపం రాళ్లు కొట్టుకుంటూ బతుకు సాగిస్తున్న ప్రభాస్ హీరోయిన్... ఎక్కడ?

గురువారం, 26 మే 2016 (13:56 IST)
టాలీవుడ్ చిత్రాల్లో అంతగా నటించకపోయినప్పటికీ నటి సంజనకు ఇక్కడ మంచి పాపులారిటీ ఉంది. కానీ చాన్సులే రావడంలేదు. అప్పుడెప్పుడో బాహుబలి ప్రభాస్ మరదలిగా బుజ్జిగాడు అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత తన ఫేట్ మారుతుందని ఎంతగా ఎదురుచూసినప్పటికీ ఫలితం కానరావడంలేదు. దీనితో ప్రభాస్ హీరోయిన్ ఇప్పుడు రాళ్లు కొట్టుకుంటూ జీవిస్తుందట. 
 
అంటే... ఇది నిజంగా కాదులెండి. సినిమాలో ఆ పాత్రలో కనిపిస్తూ దానికి జీవం పోస్తుందట. పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో నటించిన ఆమెకు ఆట్టే ఆఫర్లు ఇక్కడ రావడంలేదు. దానితో కోలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లింది. అక్కడ ఆమెకు దండుపాళ్యం 2 చిత్రంలో ఛాన్స్ వచ్చింది. ఆ చిత్రంలో ఆమె ఇలా కనిపిస్తోంది.

వెబ్దునియా పై చదవండి