అలనాటి నటి సావిత్రి. తెలుగు చిత్ర పరిశ్రమంలో 'మహానటి'గా పేరుప్రఖ్యాతలు సొంతం చేసుకుంది. కానీ, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్ల ఎదుర్కొంది. ముఖ్యంగా, తమిళ సీనియర్ నటుడు జెమినీ గణేశ్‌న్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె వైవాహిక, వ్యక్తిగత జీవితం ఎన్నో కష్టాలు అనుభవించింది.
ఇదిలావుంటే, ఆమె జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం "మహానటి". ఈ చిత్రం ఈనెల 9వ తేదీన విడుదలై మంచి ఆదరణ పొందడమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సావిత్రిని గురించి కొంతమంది సీనియర్ నటీనటులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అలా జెమినీ గణేశన్‌కు అత్యంత సన్నిహితుడైన నటుడు రాజేశ్ స్పందించారు.