ఈ సందర్భంగా.. నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ''ఇది ఒక క్యూట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమా ఫస్ట్ లుక్, టీజర్ విడుదలైన రోజు నుండి ఆడియెన్స్‌లో పాజిటివ్ బజ్ ఏర్పడింది. సినిమా మొత్తం మొత్తం పూర్తయింది. నారా రోహిత్, నందితల కాంబినేషన్ ఈ చిత్రానికి ఎంతో ప్లస్ అవుతుంది. ప్రేమ ఇష్క్ కాదల్ వంటి డిఫరెంట్ లవ్ స్టోరీని తెరకెక్కించిన దర్శకుడు పవన్ సాధినేని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఇటీవల సాయికార్తీక్ అందించిన పాటలు విడుదలయ్యాయి. పాటలకు ఆడియెన్స్‌ను మంచి స్పందన వస్తుంది. రోహిత్ బాడీ లాంగ్వేజ్ చాలా కొత్తగా ఉంటుంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి వరల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 1న గ్రాండ్ లెవల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.