'ఖైదీ నెంబర్ 150' సినిమాకు తర్వాతి సినిమాకు మెగాస్టార్ చిరంజీవి రెడీ అయిపోయారు. ఇందుకు దర్శకుడు కూడా ఖాయమైపోయాడు. ఆ దర్శకుడు ఎవరో కాదు.. సరైనోడు బోయపాటి. బోయపాటితో చేసేందుకు చిరంజీవి దాదాపుగా ఓకే చేశాడని, గీతాఆర్ట్స్ బ్యానర్‌లో దీన్ని తెరకెక్కించనున్నారట. అంతా ఓకే అయితే ఏప్రిల్‌లో పూజా కార్యక్రమాలు చేసి, మే నుంచి రెగ్యులర్‌గా షూటింగ్ ప్రారంభం కానుందని టాలీవుడ్ టాక్.