శంకర్ దర్శకత్వంలో రోబో 2 ఎప్పుడు మొదలవుతోందోనని అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా తరహాలోనే రోబో 2 కూడా ఇదిగో పులి అంటే అదిగో తోక అన్న చందంగా సాగుతోంది. ఇప్పటికే రజనీకాంత్ పి.ఎ.రంజిత్ దర్శకత్వంలో 'కబాలి' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యే సరికి ఈ ఏడాది గడిచిపోతుంది. ఇక రోబో2 సీక్వెల్ ఈ ఏడాదిలో ప్రారంభమయ్యే అవకాశం లేదని కోలీవుడ్ పండితులు జోస్యం చెప్తున్నారు.