మే 13న జి.వి.ప్రకాష్‌, శ్రీదివ్యల 'పెన్సిల్‌'

శనివారం, 30 ఏప్రియల్ 2016 (21:00 IST)
తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు సంగీతం అందించిన జి.వి.ప్రకాష్‌, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, బస్‌స్టాప్‌, కేరింత, మనసారా వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన శ్రీదివ్య జంటగా మణి నాగరాజ్‌ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'పెన్సిల్‌'. ఎం.పురుషోత్తం సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై సక్సెస్‌ఫుల్‌ డిస్ట్రిబ్యూటర్‌ జి.హరి నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.వి.ప్రకాష్‌కుమార్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియో ఇటీవల విడుదలై పెద్ద సక్సెస్‌ అయింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ చిత్రాన్ని మే 13న రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
ఈ సందర్భంగా హీరో, సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్‌కుమార్‌ మాట్లాడుతూ - ''ఇటీవల విడుదలైన మా 'పెన్సిల్‌' ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అలాగే థియేటర్‌ ట్రైలర్‌కి కూడా ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రంలోని అన్ని పాటల్ని శ్రీమణిగారు చాలా అద్భుతంగా రాశారు. ఇందులో 'రెండే కళ్ళు..' అనే పాట నాకు బాగా నచ్చింది. అన్ని పాటలూ మీకు బాగా నచ్చుతాయని ఆశిస్తున్నాను. ఈ చిత్రం ద్వారా హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ హరిగారు నిర్మాతగా మారుతున్నారు. నిర్మాత హరిగారికి కంగ్రాట్స్‌ తెలియజేస్తున్నాను. ఈ సినిమా మీ స్కూల్‌ లైఫ్‌ని, మీ చిన్న నాటి మధుర స్మృతుల్ని మళ్ళీ మీ ముందుకు తెస్తుంది. మే 13న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని అందరూ చూసి ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నాను'' అన్నారు.

వెబ్దునియా పై చదవండి