Naveen Polishetty, Allu Arjun, Ranveer Singh
సహజమైన నటనతో ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి. ఆయన నటించిన జాతిరత్నాలు సినిమా కోవిడ్ టైమ్ లోనూ ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 70 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి ఆ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడీ సినిమా నవీన్ కు సైమా బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్) అవార్డునూ సంపాదించి పెట్టింది. తాజాగా జరిగిన సైమా అవార్డ్స్ లో జాతి రత్నాలు చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా పురస్కారం గెల్చుకున్నారు నవీన్ పోలిశెట్టి