గాయనిగాను, డబ్బింగ్ ఆర్టిస్ట్ తన గొంతుతో ఆకట్టుకున్న సునీత ఇక వెండితెరపై నటనతో అభిమానులను ఆకర్షించనుంది. టాలీవుడ్లో తన తీపి గొంతుతో పాటల ప్రపంచంలో విహరించే గాయని సునీత. ఈమె పవన్ సినిమాలో నటించనున్నారనే వార్తలు వెల్లడవుతున్నాయి. త్వరలో పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకేక్కబోయే సినిమాలో సునీత నటించనున్నారట.
అందులో పవన్ కళ్యాణ్‌కు పిన్నిగా నటించనుందని సమాచారం. అత్తారింటికి దారేది సినిమాలో పవన్‌కు అత్తగా నటించిన నదియా ఆ సినిమాలో మంచి పేరు తెచ్చుకుని, భారీ ఆఫర్లను పొందింది. కాగా ఇప్పుడు సునీత కూడా అదేవిధంగా మంచి ఛాన్స్‌లు కొట్టాలని ఉద్దేశంతోనే ఈ అవకాశాన్ని అంగీకరించినట్లు సమాచారం.