ఈ క్రమంలో సిరివెన్నెల ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న సిరివెన్నెల ఆరోగ్యం బాగానే, నిలకడగానేవుందని చెప్పారు. ఆయన కుమారుడు యోగి కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. దీంతో సాహితీ అభిమానులతో పాటు.. సినీ అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.