అంతేకాకుండా, కేరళ రాష్ట్రంలోని వయానాడ్‌లో విద్యార్థుల కోసం సెల్‌ఫోన్ టవర్ నిర్మించాలని భావిస్తున్నారు. ట్రైబల్ ఏరియాల్లో సిగ్నల్స్‌లేని కారణంగా ఆన్‌లైన్ క్లాసుల కోసం కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లి క్లాసులు వినాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఈ విషయం సోనూ సూద్‌కు తెలియగానే మొబైల్ టవర్ నిర్మాణం చేయాలని ఏర్పాట్లు మొదలుపెట్టేశాడు. దీని గురించి ట్వీట్ చేసిన ఆయన.. 'ఒక్కరు కూడా చదువును మిస్ చేసుకోకూడదు. వయానాడ్, కేరళలో ప్రతి ఒక్కరికీ చెబుతున్నా. టీంను పంపించి అక్కడ మొబైల్ టవర్ ఏర్పాటు చేస్తాను. వెంటనే పనులు చూడాలని ఫౌండేషన్'ను ట్యాగ్ చేశారు.