బాలీవుడ్ స్టార్ నటుడు సోనూ సూద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలపై సోనూసూద్ సెన్సేషనల్ కామెంట్లు చేశారు. ఓ మూవీ ప్రమోషన్‌లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో సోనూ సూద్ మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో ప్రజలకు సాయం చేసినందుకు తనకు సీఎం, డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యుడు అయ్యే అవకాశాలు వచ్చాయని పేర్కొన్నారు. అయితే, ఆ అభ్యర్ధనలను తిరస్కరించినట్లు చెప్పారు. స్వేచ్ఛను కోల్పోవడం ఇష్టం లేదని, అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని సోనూ సూద్ తెలిపారు.
ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి రావాలనుకుంటే తాను ఇప్పటికే అది చేస్తున్నానని పేర్కొన్నారు. తనలో ఇంకా ఒక నటుడు, దర్శకుడు ఉన్నాడని, సినిమాల్లో తనకు సంతృప్తి లభించినపుడు, వేరే అంశాల గురించి ఆలోచిస్తానని అన్నారు.