ఇండియాలో స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... ఏంటది?

మంగళవారం, 25 జూన్ 2019 (18:45 IST)
స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ లాంటి సూపర్‌హీరోలకు పిల్లలలోనే కాదు, పెద్దలలో సైతం హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. స్పైడర్ మ్యాన్ అభిమానులకు ఇప్పుడు ఒక శుభవార్త. టామ్ హాలెండ్ నటించిన స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్ అనే సినిమా ఒక రోజు ముందుగానే భారత ప్రేక్షకుల ముందుకు రానున్నది. 
 
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా జూలై 5న రిలీజ్ అవుతుంటే.. భారత్‌లో మాత్రం ఒకరోజు ముందే అనగా జూలై 4వ తేదీనే విడుదల కాబోతోంది. ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ తన ట్వీట్‌లో స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రం హోమ్ సినిమా ఒకరోజు ముందుగానే జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది, ఇందుకోసం జూన్ 30న అడ్వాన్స్ బుకింగ్ మొదలవుతుందని పేర్కొన్నారు.
 
స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో తెరకెక్కింది. స్పైడర్ మ్యాన్ సిరీస్‌కు ఇండియాలో విశేష ఆదరణ ఉంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 
అందుకే జూలై 4వ తేదీన సినిమాను విడుదల చేయబోతున్నామని సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ఎండీ వివేక్ కృష్ణానీ వెల్లడించారు. స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ ఆదివారం మొదలుకానుందని తెలిపారు. కెప్టెన్ అమెరికా చిత్రంలో స్పైడర్ మ్యాన్‌గా టామ్ హాలెండ్ నటించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు