స్వాతి నాయుడి పెళ్లి, ఫస్ట్ నైట్ గురించి శ్రీరెడ్డి ఏం చెప్పిందంటే..?

బుధవారం, 13 మార్చి 2019 (13:20 IST)
తెలుగు సన్నీ లియోన్, యూట్యూబ్ స్టార్ స్వాతి నాయుడి వివాహం అవినాష్‌తో పెద్దల సమక్షంలో ఫిబ్రవరి 23న జరిగింది. గత 8 నెలలుగా కలిసి జీవిస్తున్నామని, తన గురించి అన్నీ తెలిసే అతను కలిసున్నాడని, ఇద్దరికీ ఇష్టం ఉన్నందున పెళ్లి చేసుకున్నామని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్వాతి నాయుడు తెలిపారు. తాజాగా వీరి వివాహంపై శ్రీరెడ్డి తన స్పందనను తెలియజేసారు. 
 
ఇంతకీ ఆమె ఏం చెప్పారంటే.. స్వాతి నాయుడికి అభినందనలు తెలుపుతూ, మీరంటే నాకెప్పుడూ గౌరవం ఉంది, మీ పెళ్లి నాకు చాలా సంతోషం కలిగించింది. మీరిద్దరి ఇంటర్వ్యూ చూసాక మీరు సంతోషంగా ఉన్నట్లు కనిపించారు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ మీ ఫస్ట్ నైట్ గురించి గుచ్చి గుచ్చి అడుగుతుంటే నాకు చాలా కోపం వచ్చింది. 
 
నేను గనక అక్కడ ఉండుంటే అతనిని చంపేసేదాన్ని, దయచేసి ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దంటూ సలహా ఇచ్చారు. యాంకర్ ఈ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మీ ఆయన కాస్త ఫీల్ అయ్యారు. దయచేసి మీరు ఈ డర్టీ ఫీల్డ్ వదిలేసి, మీ ఆయనను బాగా చూసుకోండంటూ హితవు పలికారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు