శ్రీదేవి ప్రస్తుతం కుర్ర వేషాలు వేస్తోందట. ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్తే.. ఆకట్టుకునే డ్రెస్సులు వేస్తుందట. కానీ ముఖంలో కళ తగ్గిపోవడంతో.. ఆమె వేసుకునే డ్రెస్‌లకు అందం తగ్గిపోతుందట. ఇటీవల ఓ ఈవెంట్‌కి నీలిరంగు పొడుగాటి గౌనులో ఈ భామ వచ్చింది. వయస్సును కనిపించనీయకుండా ఫిజిక్‌ను మెయిన్‌టెయిన్ చేసినా, ముఖంలో మునుపటి కళ తగ్గడంతో శ్రీదేవి వేస్తున్న డ్రస్సులు వెగటు పుట్టిస్తున్నాయట.
ఇంగ్లిష్ వింగ్లిష్తో శ్రీదేవి రీ ఎంట్రీ ఇచ్చినా.. ఇంతవరకు అమ్మడు మరో సినిమాలో కనిపించలేదు. ఇందుకు కారణం శ్రీదేవి అమ్మ, అక్క, అత్త వేషాలు వేయననీ చెప్పడం.. కీలక రోల్ మాత్రమే చేస్తానని చెప్పడంతో శ్రీదేవికి అవకాశాలు సన్నగిల్లుతున్నాయట. ఇంకా రెమ్యునరేషన్ విషయంలో కూడా నిర్మాతలకు శ్రీదేవి చుక్కలు చూపించడంతో దక్షిణాదితో పాటు బాలీవుడ్ జనం ఏమాత్రం పట్టించుకోవట్లేదట.