ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పులి’. ఇందులో అలనాటి అందాల తార శ్రీదేవి రాణి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా సంచారం ప్రకారం శ్రీదేవి ఈ చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోబోతుందట. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన శ్రుతి హాసన్, హన్సిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.