దర్శక ధీరుడు ఎస్ఎస్. రాజమౌళి కొత్త ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు నటిస్తున్నారు. వీరికి జోడీగా బాలీవుడ్ నటి అలియా భట్, బ్రిటన్ నటి లూసీ ఎడ్గర్ జోన్స్‌ను ఎంపిక చేశారు. అయితే, వ్యక్తిగత కారణాల రీత్యా లూసీ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు.
దీంతో లూసీ స్థానంలో కొత్త హీరోయిన్ కోస దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అన్వేషిస్తున్నారు. ఈ కోవలో ఆయన పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించారు. వీరిలో శ్రద్ధా కపూర్, సోనాక్షి సిన్హా, పరిణీతి చోప్రా, నిత్యా మీనన్ ఇలా అనేక మంది హీరోయిన్ల పేర్లను పరిశీలించారు. వీరందరిలో శ్రద్ధా కపూర్‌పై రాజమౌళి మనసుపడినట్టు తెలుస్తోంది.