అందుకనే చరణ్ ఫస్ట్ మూవీ చేయనని చెప్పా: రాజమౌళి

గురువారం, 18 జూన్ 2020 (10:52 IST)
దర్శకధీరుడు రాజమౌళి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌‌తో మగధీర సినిమా తెరకెక్కించడం... ఆ సినిమా సంచలన విజయం సాధించడం తెలిసిందే. ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ సంచలనం. మళ్లీ ఇప్పుడు రామ్ చరణ్‌ - రాజమౌళి కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తుండడంతో ఈ భారీ మల్టీస్టారర్ పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
 
భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల రాజమౌళి రామ్ చరణ్ గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటపెట్టాడు. 
 
అది ఏంటంటే... చరణ్‌ ఫస్ట్ మూవీని డైరెక్ట్ చేయమని ఫస్ట్ ఆఫర్ రాజమౌళికే వచ్చిందట. చిరంజీవి గారు.. చరణ్‌ ఫస్ట్ మూవీని డైరెక్ట్ చేయమని రాజమౌళిని అడిగారట. అయితే.. రాజమౌళి సున్నితంగా ఆ ఆఫర్‌ని తిరస్కరించాడట.
 
ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఇంతకీ కారణం ఏంటంటే... రామ్ చరణ్‌లో ఉన్న ప్లస్, మైనస్‌లు తనకు తెలియదు. ఫైట్స్ ఎలా చేస్తాడో తనకు తెలియదని, డ్యాన్స్, ఎమోషన్స్ విషయంలో కూడా అవగాహన లేదని.. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, చిరంజీవి వారసుడు తొలి చిత్రం అంటే, అభిమానుల్లో ఏ రేంజ్‌లో భారీ అంచనాలు ఉంటాయి. అందుకనే చరణ్ ఫస్ట్ మూవీ చేయనని చెప్పాను అని రాజమౌళి చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు