పంచాక్షరి దర్శకుడితో అంజలి సిస్టర్ ఆరాధ్య సినిమా

మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (15:39 IST)
తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో చేతినిండా ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్న అంజలి సోదరి కూడా వెండితెరకు పరిచయం కానుంది. తెలుగమ్మాయి అయిన అంజలి.. ముందుగా తమిళ సీమకు పరిచయమైనప్పటికీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా మంచి పేరు కొట్టేసింది. ప్రస్తుతం అంజలి సిస్టర్ ఆరాధ్య కూడా తెలుగు వెండితెరకు పరిచయం కానుంది.
 
మహానంది, శివరామరాజు, పంచాక్షరి వంటి సినిమాలను తెరకెక్కించిన సీనియర్ డైరక్టర్ సముద్ర దర్శకత్వంలో రూపుదిద్దుకునే కొత్త సినిమాలో ఆరాధ్య నటించబోతోందని టాక్ వస్తోంది. ''వైభవం'' పేరిట తమిళ, తెలుగు భాషల్లో రూపుదిద్దుకునే సినిమాలో ఆరాధ్య నటిస్తుందని.. ఇదే సినిమాలో దర్శకుడు ముగ్గురు యంగ్ హీరోలను పరిచయం చేస్తారని తెలిసింది. ప్రస్తుతం ఆరాధ్య క్లాసికల్, వెస్టన్ డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 

వెబ్దునియా పై చదవండి