సినీ ప్రపంచానికి ముచ్చెమటలు పట్టించిన సుచీలీక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ తనను గాయపరిచాడని ట్వీట్ చేసిన సుచిత్ర ఆపై కోలీవుడ్‌కు చెందిన అనిరుధ్, ఆండ్రియా, హన్సిక, రానా, త్రిష వంటి ఎంతోమంది సెలెబ్రిటీల ఫోటోలను నెట్లో పెట్టి హంగామా సృష్టించింది. సుచీలీక్స్‌తో సెలెబ్రెటీలు తమ గురించి ఏవైనా ఫోటోలు లీకైపోతాయా అంటూ జడుసుకున్నారు.
ఇలా టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన హీరోహీరోయిన్ల ఫోటోలు నెట్లో హల్ చల్ చేశాయి. మొత్తానికి సుచీలీక్స్ దెబ్బకు సినీ ప్రపంచం షాక్ తింది. అయితే ఈ లీక్స్ గురించి ప్రస్తుతం సుచిత్ర వివరణ ఇచ్చింది. ఇన్నాళ్లు సుచీలీక్స్‌తో షాక్ ఇచ్చిన సుచిత్ర.. కొద్ది రోజుల పాటు కనుమరుగైంది.
వాస్తవానికి ఎవరినీ నొప్పించడానికి తాను ఇష్టపడనని చెప్పింది. సుచీలీక్స్ తన తప్పు కానప్పటికీ.. తనపేరు వల్ల బాధపడిన సెలబ్రిటీలందరికీ క్షమాపణలు చెప్తున్నానని తెలిపింది. శత్రువైనప్పటికీ అవమానించే తత్త్వం తనది కాదని చెప్పింది. ఈ షాక్ నుంచి కోలుకోవడానికి తనకు ఆరు వారాల సమయం పట్టిందని తెలిపింది. తాను కోలుకోవడానికి తన భర్త, కుటుంబసభ్యులే కారణమని సుచిత్ర వెల్లడించింది.