రష్మీకి వాలెంటైన్స్ డే రోజున విష్ చేశా-సుడిగాలి సుధీర్
గురువారం, 1 ఆగస్టు 2019 (17:07 IST)
జబర్దస్త్ నటుడు సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ గౌతమ్‌ల మధ్య ప్రేమాయణం నడుస్తుందని టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇద్దరి మధ్య ప్రేమ లేదని పలు సందర్భాల్లో వీరు ఖండించారు. అయితే తాజాగా సుడిగాలి సుధీర్.. రష్మీతో వున్న సంబంధం గురించి నోరు విప్పాడు.
సుధీర్ అంటే తన టాలెంట్ గురించి మాట్లాడరు. కానీ సుధీర్-రష్మీ అంటారు. రష్మీ అనే అమ్మాయి తన లైఫ్‌లో లేకపోతే తనకు జీవితమే లేదు. ఆమె ప్రభావం తనపై ఎంతో ఉందని చెప్పుకొచ్చాడు. రష్మీకి తనుకు ఏడు సంవత్సరాల నుంచి పరిచయం ఉంది.
కానీ ఎప్పుడూ ఫోన్‌లో మాట్లాడుకున్నది లేదన్నాడు. తాజాగా రెండున్నర గంట సేపు మాట్లాడాం. కానీ అది మా ప్రొఫెషన్ గురించే. అయితే ఓసారి మాత్రం రష్మీకి వాలంటెన్స్ డే రోజు విష్ చేశానని సుడిగాలి సుధీర్ చెప్పుకొచ్చాడు.