కేబుల్ రెడ్డి గా సుహాస్ చిత్రం ప్రారంభం

శుక్రవారం, 18 ఆగస్టు 2023 (16:04 IST)
Suhas, Shailesh Kolanu, Shalini Kondepudi
 'రైటర్ పద్మభూషణ్' తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న హీరో సుహాస్, అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ కోసం నూతన దర్శకుడు శ్రీధర్ రెడ్డి తో పని చేస్తున్నారు. ఫ్యాన్ మేడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై బాలు వల్లు, ఫణి ఆచార్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'కేబుల్ రెడ్డి' అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. షాలిని కొండేపూడి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ రోజు పూజా కార్యక్రమాలతో రామానాయుడు స్టూడియోలో గ్రాండ్ గా లాంచ్ చేశారు. శ్రీధర్ రెడ్డి(దర్శకుడు) కెమెరా స్విచాన్ చేయగా దర్శకుడు శైలేష్ కొలను క్లాప్ కొట్టి స్క్రిప్ట్ ని మేకర్స్ కి అందించారు.
 
ఈ సందర్భంగా హీరో సుహాస్ మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీధర్ మంచి స్నేహతుడు. తనకి ఇది తొలి చిత్రం. రెండు రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ మూవీ ఇది. చాలా ఎక్సయిటింగా వుంది.'' అన్నారు  
 
శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. చాలా ఆసక్తికరమైన కథ రాసుకున్నాను. అంతే ఆసక్తికరంగా, యంగేజింగా షూట్ చేయడానికి సన్నాహాలు చేశాం. ఒక టౌన్ లో జరిగే కథ ఇది. క్లీన్ ఎంటర్ టైనర్ గా వుంటుంది''అన్నారు
 
షాలిని కొండేపూడి మాట్లాడుతూ.. చాలామంచి టీంతో ఈ సినిమా చేస్తున్నాం. చాలా ఎక్సయిటింగ్ గా వుంది. దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు'' అన్నారు
 
బాలు వల్లు మాట్లాడుతూ .. ఇది మా మొదటి సినిమా. చాలా మంచి టీంతో పని చేస్తున్నాం. బౌండెడ్ స్క్రిప్ట్ తో షూట్ కి వెళ్తున్నాం. మొదటి షెడ్యుల్ 20 రోజుల్లో పూర్తి చేస్తున్నాం''అన్నారు.
 
ఈ చిత్రానికి మహి రెడ్డి పండుగల డీవోపీ గా పని చేస్తున్నారు. స్మరణ్ సాయి సంగీతం అందిస్తుండగా క్రాంతి ప్రియం  ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు