50 ఏళ్లలో సైతం కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన తాజా చిత్రం సుల్తాన్ లో మరోసారి తన బాడీని చూపించి తన ఫిట్ నెస్ ఏమిటో చూపించాడు. సుల్తాన్ చిత్రం ట్రెయిలర్ విడుదలైంది. హర్యానా రెజ్లర్ సుల్తాన్ అలీ ఖాన్ జీవిత చరిత్ర ఆధారంగా అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన అనుష్క శర్మ నటించింది.