సందీప్ కిషన్‌తో పీకల్లోతు ప్రేమలో రెజీనా కెసాండ్రా!

శుక్రవారం, 16 డిశెంబరు 2022 (18:23 IST)
టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్, హీరోయిన్ రెజీనా కెసాండ్రాల మధ్య ప్రేమాయణం సాగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోది. వాస్తవానికి వీరి ప్రేమకు సంబంధించిన వార్తలు గతంలో కూడా వచ్చాయి. 
 
ఇపుడు మరోమారు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే, ఈ దఫా మాత్రం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చేలా సందీప్ కిషన్ చేసిన ట్వీట్ ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చిపెట్టింది. రెజీనా పుట్టిన రోజు సందర్బంగా సందీప్ కిషన్ ఈ ట్వీట్ చేశారు. 
 
"హ్యాపీ బర్త్‌డే పాప.. లవ్యూ.. అన్ని విషయాలలో నీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా.. స్టే బ్లెస్డ్" అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రెజీనాతో చాలా సన్నిహితంగా దిగిన ఓ సెల్ఫీ ఫోటోను కూడా సందీప్ కిషన్ షేర్ చేశారు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందనే ప్రచారం నిజమేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు