ఫోర్న్ స్టార్ నేపథ్యం నుంచి నేరుగా బాలీవుడ్‌లో దిగిన హాట్ బ్యూటీ సన్నీ లియోన్‌ను ఒకప్పుడు పలకరించేవారే లేరు. సినిమా ఛాన్సుల కోసం ప్రాధేయపడింది. ఎక్కిన గుమ్మం.. దిగిన గుమ్మంలా ప్రయత్నించినా ఛాన్సులు రాలేదు. కానీ ఐటెం సాంగులు ఆమెను ఎక్కడికో తీసుకెళ్లాయి. ఇప్పుడామె తన వాల్యూ ఏంటో రేటు పెంచి మీరీ చెబుతోంది. దానికి బిత్తరపోవడం బాలీవుడ్ వంతయింది.
ఎవరు అవునన్నా కాదన్నా.. హాట్ బ్యూటీగా సన్నీలియోన్‌కు ఉన్నంత క్రేజ్ కాస్త ఎక్కువే అని చెప్పవచ్చు.. సినీ ఇండస్ట్రీలో ఈ మాజీ ఫోర్న్ స్టార్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంది. సినిమాల పరంగా సక్సెస్ రేటు లేకపోయినా ఐటెం సాంగ్‌లతో సన్నీ లియోన్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. సన్నీకి రావాల్సిన అవకాశాలు మరొకరికి వెళ్లే చాన్సే లేదు అంతేకాదు వేరొకరికి రావాల్సిన అవకాశాలు కూడా ఈ హాట్ బ్యూటీనే దక్కించుకుంటోంది.
తాజాగా ఓ పాప్ సింగర్ ఇండియాలో ఇవ్వబోయే మ్యూజిక్ షో లో స్టెప్పులేయడానికి సన్నీని ఒప్పించేందుకు ఈవెంట్ ఆర్గనైజర్‌లు ప్రయత్నిస్తున్నారట. బాలీవుడ్ యంగ్ బ్యూటీతోపాటు ఇద్దరు కుర్రహీరోలు పాల్గొంటున్నా.. సన్నీ ఈ షోలో స్టెప్పులేయాల్సిందేనని వారు డిసైడ్ అయ్యారట. కెనేడియన్ పాప్ సింగర్ జస్టిస్ బాబర్ మే నెలలో ఇవ్వబోయే షో కోసం ఇప్పట్నుంచే బాలీవుడ్ స్టార్స్‌ను దగ్గర చేసుకుంటున్నారట ఆర్గనైజర్లు. అలియాభట్, వరుణ్ థావన్, సిద్ధార్త్ మల్హోత్రా వంటి అప్‌కమింగ్ స్టార్స్ పాల్గొనబోయే ఈ కార్యక్రమానికి మరింత క్రేజ్ తీసుకురావడానికి సన్నీని రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట.
మొత్తానికి స్టార్స్ ఎవరున్నా సన్నీ క్రేజే వేరు అని క్లియర్‌గా తేలింది.! ఈ షో కు భారీ మొత్తం డిమాండ్ చేయడంతో బాలీవుడ్ భామలు, హీరోలు ముక్కున వేలేసుకున్నారట. సన్నీ ఏంటి ఒక్కసారిగా ఇలా రేటు పెంచేసిందని అవాక్కయ్యారట.