నటి సురేఖా వాణి ప్రస్తుతం వార్తల్లో నిలుస్తూనే వున్నారు. గతంలో కూతురు సుప్రీతతో కలిసి డ్యాన్సులు చేస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు. ఈ వీడియోల ద్వారా ఆమె వార్తల్లో నిలిచే వారు. కానీ ప్రస్తుతం రెండో పెళ్లిపై వార్తలు నిలుస్తున్నారు. ఈ మధ్య సురేఖ రెండో వివాహానికి సిద్ధమైందని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందని పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై సురేఖతో పాటు ఆమె కూతురు కూడా ఘాటుగా స్పందించారు.