‘సింగం తొలి రెండు భాగాలు సూపర్ హిట్టయిన నేపథ్యంలో ‘ఎస్-3’పై అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో.. సూర్యతో శ్రుతి లుక్ అదిరింది.. కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయ్యిందే.. అంటున్నారు.. సింగం 3 స్టిల్స్ చూసిన వారంతా. శ్రుతిహాసన్‌తో సెవన్త్ సెన్స్ సినిమాలో నటించిన సూర్య ప్రస్తుతం సింగం 3లో నటిస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ దగ్గర్నుంచి వరుస హిట్లతో దూసుకెళ్తున్న శ్రుతిహాసన్ ‘ఎస్-3’ పేరిట సింగం సిరీస్‌లో భాగంగా వస్తున్న సినిమాలో నటిస్తోంది.