మెగాస్టార్ కెరీర్లోనే ఓ బిగ్గెస్ట్ హిట్ కావాలన్న పట్టుదలతో చెర్రీ...

బుధవారం, 11 అక్టోబరు 2017 (19:00 IST)
తెలుగు సినీచరిత్రలో అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ మొదటి స్థానం చిరంజీవిదనే చెప్పాలి. అందుకు నిదర్శనంగా చిరంజీవి నటించిన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత సినీ ఇండస్ట్రీలోకి రీ-ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్‌కి జనంలో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని నిరూపించిన సినిమా ఖైదీ నెంబర్ 150. 
 
ఇప్పుడున్న యంగ్ హీరోలకు ధీటుగా చిరు అందరినీ ఆశ్చర్యపరిచేలా తన నటనతో దూసుకెళుతున్నాడు. అదే ఉత్సాహంతో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 151వ సినిమా సైరా నరసింహారెడ్డి సినిమాకు శ్రీకారం చుట్టారు చిరంజీవి. ఇప్పుడున్న ఈ సినిమాను ఛాలెంజ్‌గా తీసుకున్నారు చిరు. అందుకే ఉయ్యాల వాడ నరసింహారెడ్డి క్యారెక్టర్ కోసం ఎన్నో కసరత్తులు చేస్తున్నారు. అంతేకాకుండా తన తండ్రి కెరీర్లో బిగ్టెస్ట్ హిట్‌గా నరసింహారెడ్డి నిలిచిపోవాలని చిరు తనయుడు రాంచరణ్‌ భావిస్తున్నారు.
 
అందుకే ఖర్చు విషయంలో ఏమాత్రం వెనుకాడకుండా 200 కోట్ల రూపాయలు వెచ్చించి సినిమాను తీయబోతున్నారు. నరసింహారెడ్డి సినిమాను నాలుగు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేయాలని చిరు నిర్ణయించుకున్నారు. అందుకే భారీ ప్లాన్ కూడా వేశారు. నరసింహారెడ్డి సినిమా అనువాద చిత్రం అనే ఫీలింగ్ ఏ భాషలోను రాకుండా ఉండటం కోసమే బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతి, నయనతార, సుదీప్‌లను ఎంచుకున్నారు. బ్రిటీష్‌ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో జగపతిబాబు నటిస్తున్నారు. 
 
ఉయ్యాలవాడ పెద్దమల్లారెడ్డి క్యారెక్టర్‌లో అమితాబచ్చన్ నటించబోతున్నారు. ఈ సినిమాలో చిరు మాట్లాడే ప్రతి పదాన్ని మాటల రచయిత సాయి మాధవ్‌తో రాయించడం మొదలెట్టారు. ఎక్కడా అభిమానులకు అసంతృప్తి కలగకుండా ప్రతి సన్నివేశం ఆకట్టుకునే విధంగా జాగ్రత్త పడుతున్నారు సురేంద్ర రెడ్డి. అత్యంత భారీ బడ్జెట్తో తీస్తున్న సినిమా కావడం, అందులోను నిర్మాత రామ్‌చరణ్ కావడంతో సినిమా అనుకున్న దానికన్నా ఎక్కువ వసూళ్లను రాబట్టాలని చిరంజీవి తెగ ఆరాటపడిపోతున్నారట.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు