మా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా? తమ్మారెడ్డి ఏమంటున్నారు?

సోమవారం, 2 జులై 2018 (17:45 IST)
మెగాస్టార్ చిరంజీవితో అనుబంధంపై టాలీవుడ్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. చిరంజీవితో తనకు పడదని చాలా మంది అనుకుంటుంటారని... ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందని భావిస్తుంటారని, అయితే అదంతా అవాస్తవమని తమ్మారెడ్డి తెలిపారు. పైగా, తన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ ఫోన్‌కాల్ చిరంజీవి దగ్గర నుంచే వచ్చిందని, తనకు శుభాకాంక్షలు తెలిపారని వెల్లడించారు. ఆయన కాల్ చూసి తానే ఆశ్చర్యపోయానని చెప్పారు.
 
తన ఆత్మీయులతో కలసి సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆదివారం పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత యేడాది తన పుట్టినరోజైన రెండు రోజులకు తన కుటుంబంలో ఓ విషాదకర సంఘటన జరిగిందన్నారు. ఆ బాధ నుంచి బయటపడేందుకే నావాళ్లు అనుకునే వారి మధ్య ఈ పుట్టిన రోజును జరుపుకున్నానని వివరించారు. 
 
తన జీవితంలో ఇండస్ట్రీ తప్ప మరెవరూ లేరని... రాజకీయ నేతలు కూడా తనతో మంచిగా మాట్లాడతారని, కానీ తనకు ఇండస్ట్రీనే ప్రపంచమని అన్నారు. చిరంజీవితో తనకు పడదని చాలా మంది అనుకుంటుంటారని...  తన పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ ఫోన్ కాల్ చిరంజీవి దగ్గర నుంచే వచ్చిందని, తనకు శుభాకాంక్షలు తెలిపారని వెల్లడించారు. ఆయన కాల్ చూసి తానే ఆశ్చర్యపోయానని చెప్పారు. 
 
అదేసమయంలో ఇండస్ట్రీలో తనకు శత్రువులు ఎవరూ లేరని... తాను పరుషంతో మాట్లాడినా అది ప్రేమతోనే అని, ద్వేషంతో తాను ఎన్నడూ మాట్లాడనని తెలిపారు. ఏదైనా ప్రేమతోనే జయించగలమనేది తన నమ్మకమని చెప్పారు. తన కంటే వెనుక ఇండస్ట్రీకి వచ్చిన వారు తనకన్నా పైస్థాయికి చేరితే ఆనందించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని తానని తమ్మారెడ్డి వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు