పొరపాటుకు మన్నించండి.. చేతులు జోడించి క్షమాపణలు.. తనికెళ్ల భరణి (video)

శనివారం, 17 ఏప్రియల్ 2021 (10:01 IST)
నటుడిగా రచయితగా ఎంతో ప్రఖ్యాతలు ఉన్న తనికెళ్ళ భరణి వార్తల్లో నిలిచారు. తనికెళ్ళ భరణి గురించి సినీ అభిమానులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు.

శబ్బాష్‌ రా శంకరా అంటూ ఆయన ప్రచురించిన పుస్తకంకు కొనసాగింపుగా ఫేస్‌బుక్‌ ద్వారా కొత్త కవితలను అభిమానులకు పరిచయం చేస్తున్న క్రమంలో తాజాగా పోస్ట్‌ చేసిన ఓ కవిత హేతువాదుల ఆగ్రహానికి గురైంది. దీనితో వెంటనే తనికెళ్ళ భరణి వారికి క్షమాపణలు చెప్పారు.
 
ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన శబ్బాష్‌ రా శంకరా కవితలో దురదృష్టవశాత్తూ కొన్ని వాక్యాలు కొందరి మనసులను నొప్పించాయి. ఆ కవితకు వివరణ ఇస్తే కవరింగ్‌లాగా ఉంటుంది.

కాబట్టి అలాంటిదేం చేయకుండా నొప్పించినందుకు నా చేతులు జోడించి బేషరతుగా క్షమాపణలు చెప్తున్నా. ఆ పోస్టు కూడా డిలీట్‌ చేశాను. నాకు హేతువాదులన్నా, మానవతావాదులన్నా గౌరవమే తప్ప వ్యతిరేకత లేదు. అలాగే ఏ మనిషికీ ఇంకొకరిని నొప్పించే అధికారమే లేదు. జరిగిన పొరపాటుకు మన్నించండి అంటూ తనికెళ్ల భరణి చెప్పుకొచ్చారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు