"ఎఫ్-3" నుంచి మరో పోస్టర్ రిలీజ్

శుక్రవారం, 1 జనవరి 2021 (14:10 IST)
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్, జూనియర్ హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ఎఫ్-3. ఇది ఎఫ్-2కు సీక్వెల్. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ  చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. 
 
గత యేడాది సంక్రాంతికి రిలీజైన ఈ ఎఫ్-2 సంపూర్ణ వినోదంతో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్రేక్ష‌కులని క‌డుపుబ్బ న‌వ్వించింది. త‌మ‌న్నా, మెహ‌రీన్ క‌థానాయిక‌లుగా న‌టించ‌గా, దిల్ రాజు చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సాధించిన విజ‌యంతో మేక‌ర్స్ ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 మూవీ చేయాల‌ని భావించారు.
 
వెంకటేష్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సినిమా తాలూకు కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేయ‌గా,  ఇందులో వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ తోపుడు బండ్లలో డబ్బులు నింపుకొని హుషారుగా షికారు చేస్తున్నట్లు కనిపించారు. 
 
ఇకపోతే శుక్రవారం ఎఫ్ 3 నుండి మ‌రో పోస్ట‌ర్ విడుద‌లైంది. ఇందులో వెంకీ, వ‌రుణ్‌లు డ‌బ్బుల‌ని చూసి మైమ‌రచిపోతున్న‌ట్టు క‌నిపిస్తున్నారు. ‘ఈసారి మూడింతల వినోదంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు వ‌స్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం సెట్స్ పై ఉంది. స‌మ్మ‌ర్‌కు మూవీని తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు