టెక్నాలజీ మారినా ఆర్ట్ డైరెక్టర్ వర్క్ కంప‌ల్‌స‌రీ - ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్

మంగళవారం, 19 జులై 2022 (16:22 IST)
Art Director Sahi Suresh
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'రామారావు ఆన్ డ్యూటీ' జూలై 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ కు సిద్ధమౌతోంది. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన సాహి సురేష్ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న  'రామారావు ఆన్ డ్యూటీ' చిత్ర విశేషాలివి.
 
ఆర్ట్ డైరెక్టర్ గా మీ కెరీర్ ఎలా మొదలైయింది ?
'భైరవ ద్వీపం' చూసిన తర్వాత ఆర్ట్ విభాగంపై ఇష్టం పెరిగింది. ఇష్టం కాస్త వ్యామోహంగా మారింది,. సినీ పరిశ్రమలో తెలిసినవారి ద్వారా ఆర్ట్ విభాగంలో చేరారు. నా అదృష్టవశాత్తూ భైరవదీపం చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా చేసిన పేకేటి రంగా గారి దగ్గర చేరాను. తర్వాత అశోక్, ఆనంద్ సాయి గారితో కలసి పని చేశాను. అంత గొప్ప అనుభవం వున్న వారి దగ్గర పని చేయడం వలన ఆర్ట్ విభాగంపై మంచి పట్టు దొరికింది. శక్తి సినిమాకి ఆనంద్ సాయి గారితో పని చేస్తున్నపుడు అశ్వనీదత్ గారు నా ప్రతిభని గుర్తించి 'సారొచ్చారు' సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చారు. రవితేజ గారు కొత్త వారిని ప్రోత్సహించడంలో ముందుంటారు. ఆర్ట్ డైరెక్టర్ గా ఆయన నన్ను అంగీకరించారు. ఆ రోజు నుండి మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. నిర్విరామంగా దాదాపు 40 చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశాను.
 
40 సినిమాలు చేశారు కదా.. మీకు సవాల్ గా అనిపించిన చిత్రం ? మీకు తృప్తిని ఇచ్చిన చిత్రం ?
కంచె, ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, 'అ' చిత్రాలు చాలా తృప్తిని ఇచ్చాయి. ఈ చిత్రాలకు చాలా ప్రశంసలు కూడా దక్కాయి. చాలా మంది దర్శకులు అభినందించారు. దర్శకురాలు సుధా కొంగర ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం చూసి ఫోన్ చేసి ఆర్ట్ విభాగం అద్భుతంగా వుందని మెచ్చుకున్నారు.
 
'రామారావు అన్ డ్యూటీ' ఆర్ట్ వర్క్ ఎలా వుంటుంది ?
'రామారావు అన్ డ్యూటీ' ఛాలెజింగ్ మూవీ. నాకు ప్రతి రెండేళ్ళకోసారి పిరియాడికల్ సినిమాలు వస్తున్నాయి. 'రామారావు అన్ డ్యూటీ' 95లో రూరల్ జరిగే కథ. 95 నేపధ్యాన్ని దాదాపు మొత్తం రిక్రియేట్ చేశాం. చాలా రీసెర్చ్ చేశాం. ఆనాటి గ్రామం, వీధులు, ఎమ్మార్వో ఆఫీస్.. ఇలా అద్భుతమైన సెట్స్ వేశాం. అలాగే పాటల కోసం కూడా గ్రాండ్ సెట్స్ వేశాం. రవితేజ గారికి ఎమ్మార్వో ఆఫీస్ సెట్ చాలా నచ్చింది. మేము రీసెర్చ్ చేసిన పెట్టిన ప్రతి డిటేయిల్ ని ఎంతో ఆసక్తిగా అడిగేవారు. 
 
మీ ఆర్ట్ వర్క్ కి హీరోల నుండి ఎలాంటి ప్రసంశలు వస్తుంటాయి ?
ఎన్టీఆర్ కథానాయకుడు , మహానాయకుడు చిత్రాల ఆర్ట్ వర్క్‌కు బాలకృష్ణ గారు చాలా అభినందించారు. ఎన్టీఆర్ గారి పాత సినిమాలన్నీ రిక్రియేట్ చేయడం చూసి ప్రతిసారి మెచ్చుకునే వారు. అ సినిమాకి కూడా మంచి ప్రసంసలు దక్కాయి. నాగ చైనత్యగారి చేసిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. నితిన్ గారి భీష్మ చేశాను. ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం చేస్తున్నాను. నితిన్ గారు  తన ప్రతి ప్రాజెక్ట్ ని నన్నే చేయమని చెప్పడం చాలా ఆనందాన్ని ఇస్తుంది.
 
ప్రతి సినిమాకి కొత్తదనం చూపించడానికి ఒక ఆర్ట్ డైరెక్టర్ గా ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేస్తారు ?
ఆర్ట్ అనేది దర్శకుడు ఇన్స్పైర్ చేసిన దాని బట్టి కొత్తగా మారుతుంటుంది. ఇది చాలా ప్రధానం. దర్శకుడు  ఎంత ఇన్స్పైర్ చేస్తే అంత మంచి ఫలితం వస్తుంది. దర్శకుడు, డీవోపీ, ఆర్ట్ డైరెక్టర్,,. ఈ ముగ్గురి కెమిస్ట్రీ బావుంటే అవుట్ పుట్ నెక్స్ట్ లెవెల్ లో వుంటుంది.
 
 ఆర్ట్ డైరెక్టర్- ప్రొడక్షన్ డిజైనర్ గా మార్పు వచ్చిన తర్వాత  మీ వర్క్ లో ఎలాంటి మార్పు వచ్చింది?
వర్క్ లో ఎలాంటి మార్పు లేదు,  ప్రొడక్షన్ డిజైనర్ అనేది హాలీవుడ్ వుంది. స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత ప్రొడక్షన్ డిజైనర్ డ్రస్సులు, కలర్స్, సెట్స్ ఇలా అన్నీ ముందే డిసైడ్ చేసేస్తారు. తర్వాత ఎవరి పార్ట్ వారు చూసుకుంటారు. మనకి ఇప్పుడిప్పుడే మొదలైయింది. ప్రేక్షకులు ప్రతిది పరిశీలిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ కి రావాల్సిన పేరు వస్తుంది.
 
దర్శకుడు ఒక సీన్ చెబుతున్నపుడు బడ్జెట్ పరిమితులు పెడతారా ?
బడ్జెట్ పరిమితులు వుంటాయి. ఉదాహరణ ..20 ఏళ్ళ క్రితం రైల్వే స్టేషన్ లో ఒక నిమిషం రన్ టైం వున్న సీన్ వుందనుకుంటే దాన్ని క్లోజ్ గా చేయడానికి ప్రయత్నిస్తాం. ఓపెన్ గా వెళ్తే చాలా బడ్జెట్ కావాల్సివస్తుంది.  సినిమాలో రన్ టైం ఎక్కువ వుంటే దాన్ని ఇంపార్ట్టెన్స్ ని ప్రకారం ఓపెన్ గా చేస్తాం.  వున్నదానితో బెటర్ గా చూపించడమే ఆర్ట్ డైరెక్షన్.
 
టెక్నాలజీ, సిజీ రావడం మీ వర్క్ పై ప్రభావం ఉంటుందా ?
టెక్నాలజీ  మంచిదే. ఎంత టెక్నాలజీ వచ్చినా ఆర్ట్ డైరెక్టర్ వర్క్ అతనే చేయాలి. ఎక్కడ లైవ్ చేయాలి ? ఏది సిజీ చేయాలనే బేస్ ఆర్ట్ డైరెక్టర్ దగ్గరే వుంటుంది.
 
కొత్త చేస్తున్న సినిమాలు
మాచర్ల నియోజికవర్గం, కార్తికేయ 2, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నితిన్ -వక్కంతం వంశీ సినిమాలు చేస్తున్నా.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు