'తెల్ల‌వారితే గురువారం` మ‌రి కారులో ఎక్క‌డికి ముగ్గురి ప్ర‌యాణం!

గురువారం, 11 ఫిబ్రవరి 2021 (18:34 IST)
Simha Koduri, Misha Narang, Chitra Shukla,
`ఓ కారులో హీరో శ్రీ‌సింహా కోడూరి మ‌రో అమ్మాయితో రొమాన్స్ చేస్తుంటే, వారిని ఓర‌ కంట చూస్తూ, అత‌ని భార్య కారును డ్రైవ్ చేస్తోంది. భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ పెళ్లి దుస్తుల్లోనే ఉండ‌టం గ‌మ‌నార్హం. కారులోని మిర్ర‌ర్‌కు డాక్ట‌ర్లు ఉప‌యోగించే స్టెత‌స్కోప్ ఉండ‌టం ఇంకో విశేషం` ఇది  'తెల్ల‌వారితే గురువారం` పోస్ట‌ర్‌లో వున్న కంటెంట్‌. దీని గురించి తెలియాలంటే మార్చి 27 వ‌ర‌కు ఆగాల్సిందేన‌ని ద‌ర్శ‌కుడు మ‌ణికాంత్ తెలియ‌జేస్తున్నారు.
 
సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీర‌వాణి కుమారుడు, 'మ‌త్తు వ‌ద‌ల‌రా' చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మై ఆక‌ట్టుకున్న శ్రీ‌సింహా కోడూరి న‌టిస్తోన్న రెండో చిత్రం 'తెల్ల‌వారితే గురువారం'. మార్చి 27న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం గురువారం ప్ర‌క‌టించింది. శ్రీ‌సింహా స‌ర‌స‌న నాయిక‌లుగా చిత్రా శుక్లా, మిషా నారంగ్ న‌టిస్తున్నారు.

ఈ చిత్రంతో మ‌ణికాంత్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సాయి కొర్ర‌పాటి స‌మ‌ర్పిస్తోన్న ఈ చిత్రాన్ని వారాహి చ‌ల‌న‌చిత్రం, లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ల‌పై ర‌జ‌ని కొర్ర‌పాటి, ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్ప‌నేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ‌రోవైపు తండ్రి ఎం.ఎం. కీర‌వాణి త‌ర‌హాలో బాణీలు క‌డుతూ ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా రాణిస్తున్న కాల‌భైర‌వ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ వివ‌రాలు తెలియ‌జేసింది.
 
ఇంకా ఈ సినిమాలో రాజీవ్ క‌న‌కాల‌, స‌త్యా, అజ‌య్‌, వైవా హ‌ర్ష‌, శ‌ర‌ణ్యా ప్ర‌దీప్‌, గిరిధ‌ర్‌, ప్రియ‌, ర‌వివ‌ర్మ‌, పార్వ‌తి, సిరి హ‌నుమంత్‌, మౌర్య‌, ప‌ద్మావ‌తి న‌టిస్తున్నారు. సినిమాటోగ్ర‌ఫీ: సురేష్ ర‌గుతు, ర‌చ‌న‌: నాగేంద్ర పిళ్లా, ఎడిటింగ్‌: స‌త్య గిడుతూరి, పాట‌లు: కిట్టు విస్సాప్ర‌గ‌డ‌, ర‌ఘురామ్‌, కృష్ణ వ‌ల్లెపు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు