అలాగే ఫేజ్–2లో నాసాతో కలిసి రెండేళ్లపాటు పనిచేసే అవకాశం దక్కింది. బ్రేక్ ది ఐస్ ఛాలెంజ్ పేరుతో నిర్వహించిన దీనికి 48 దేశాల నుంచి అనేక యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు, శాస్త్రవేత్తలు, విద్యార్థుల నుంచి 374 ప్రాజెక్టులు వచ్చాయి. ఏయూ నుంచి ఎంటెక్ పూర్తి చేసిన ఆశీష్‌కుమార్, అమరేశ్వరప్రసాద్‌లతో పాటు యూఎస్ నుంచి ప్రణవ్‌ప్రసాద్ బృందం రూపొందించిన ప్రాజెక్టు టాప్ టెన్‌లో నిలిచి అవార్డు పొందింది.