ఈ సినిమాను చూస్తే మనకు అప్పటి కిక్2, ఖలేజా, 'శ్రీమంతుడు, మహర్షి, ఫిదాతోపాటు ఇటీవలే వచ్చిన 'శ్రీకారం' వరకూ చాలా సినిమాలు మనసులో మెదులుతాయి. అందులోంచి ఒక సీను, ఇందులోంచి ఒక సీన్ తీసుకుని రుచికరమైన కిచిడీని దర్శకుడు భాగ్యరాజ్ కణ్ణన్ తయారు చేశాడు. ఏదో కొద్దో గొప్పో పేరున్న కార్తి నుంచి ఇటువంటి సినిమా రావడం చాలామందికి నిరాశే మిగిలింది. సినిమాను తీసుకున్న వారంతా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. 100మందితో లావిష్గా తీసినా ఇంటర్ వెల్‌కే సినిమా చూసేసిన ఫీలింగ్ కలుగుతుంది. మరలా సెకండాఫ్ అంటూ దాన్ని సాగతీసి ఇటు అటూ అటు ఇటూ తిప్పేసి చుట్టచుట్టేశాడు.
క్లయిమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీన్ మొత్తం బోయపాటి సినిమాలని తలపిస్తుంది. ఇక హీరోయిన్‌గా చేసిన రస్మిక మండన్నా ఇందులో చాలా పేలవంగా కనిపించింది. గ్లామర్ పూర్తిగా తగ్గిపోయింది. సరిలేరు నీకెవ్వరులో వున్న రస్మికనేనా! అని ఆశ్చర్యపడేంతగా ఆమె కనిపిస్తుంది. పైగా వీరిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు కూడా పేలవంగానే వున్నాయి. అందుకే కనీసం విలున్నప్పుడల్లా తెలుగులో హిట్ అయిన సినిమాలు పెద్ద హీరోల సినిమాలు కార్తిలాంటి వారు చూడాలి. లేదంటే సుల్తాన్ లాంటివి పుట్టుకొస్తుంటాయి. చివరికి నష్టం ఎవరికి?