ఒక స్కిట్‌కు 4 నుంచి 5 లక్షలు ఇస్తారు. కామెడీ యాక్టర్లు కాదు కుబేరులే. బాగా సంపాదించేశారు. జబర్దస్త్ టీంలో ఉన్న వారందరూ కోట్లకు పడుగలెత్తారు. ఇక వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు. టీకి టికానా కొట్టే వాళ్ళు ఇప్పుడు కోట్లకు కోట్లు సంపాదించేశారు. ఇది కొంతమంది యూట్యూబ్‌లో మా గురించి ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదనకు గురయ్యాడు శాంతి స్వరూప్.
ఒక్క స్కిట్‌కే 5 లక్షల దాకా నిర్వాహకులు ముట్టజెబుతారని ప్రచారం చేస్తున్నారు. నాకు కూడా 2 లక్షలు ఇస్తున్నారని చెబుతున్నారు. ఇలాంటి ప్రచారం దయచేసి చేయవద్దండి. మాకు స్కిట్‌కు ఇచ్చేది 5 నుంచి 10 వేల రూపాయలు మాత్రమే. కొంతమంది అయితే 2,500 రూపాయలు మాత్రమే ఇస్తారు.