ఈ సందర్భంగా హీరోయిన్ కృతిశెట్టి పలు విషయాలు తెలియజేసింది. నాకూ, సుధీర్ బాబు గారి కంటే సుధీర్, ఇంద్రగంటి గారి కెమిస్ట్రీ బావుంటుంది (నవ్వుతూ). సుధీర్, ఇంద్రగంటి గారి మధ్య గ్రేట్ వర్క్ ఎనర్జీ వుంటుంది. నేను పని చేసిన అందరు దర్శకులు, హీరోల దగ్గర మంచి విషయాలు నేర్చుకున్నాను. ఇంద్రగంటి గారి సినిమా షూటింగ్ స్పెషల్గా వుంటుంది. దాదాపు 70 రోజులు ఈ సినిమా కోసం పని చేశాను. ఇంద్రగంటి గారు చాలా కూల్. తన పనిని చాలా ఎంజాయ్ చేస్తారు. సెట్ కి ప్రతి రోజు ఫ్రెష్ మైండ్ తో వస్తారు. చాలా అంశాలు ఆయన నుండి నేర్చుకున్నాను.
- కెరీర్ బిగినింగ్ లోనే ద్విపాత్రాభినయం చేసే అవకాశం రావడం ఆనందంగా వుంది. చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అఖిల పాత్రని చాలా మంది ఇష్టపడుతున్నారు. ఒక నటిగా చాలా ఆనందంగా వుంది. నిజానికి నేను డాక్టర్ ని కావాలని అనుకున్నాను. ఒక యాడ్ ఫిల్మ్ షూటింగ్ కోసం హైదరా బాద్ రావడం, తొలి సినిమా ఉప్పెన అవకాశం దొరకడం, తర్వాత మంచి మంచి పాత్రలు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. మరింత కష్టపడి మరిన్ని మంచి పాత్రలు , సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.