`దేశముదురు` సినిమాతో తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసిన హన్సిక అనతికాలంలోనే అగ్రకథానాయికగా గుర్తింపును సొంతం చేసుకున్నది. ఆమె తెలుగులో నటిస్తున్న తొలి మహిళా ప్రధాన చిత్రం మై నేమ్ ఈజ్ శృతి ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీనివాస్ ఓంకార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై రమ్య బురుగు, నాగేంద్రరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిలింనగర్ దైవసన్నిధానంలో చిత్ర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రేవతి క్లాప్‌నివ్వగా వైష్ణవి కెమెరా స్విఛాన్ చేశారు. తొలి సన్నివేశానికి వంశీ గౌరవ దర్శకత్వం వహించారు.