టాలీవుడ్ నటి పునర్నవి నిశ్చితార్థంలో షాక్, అంతా ఉత్తదే...

శుక్రవారం, 30 అక్టోబరు 2020 (18:52 IST)
బిగ్ బాస్ ఫేమ్ టాలీవుడ్ నటి పునర్నవి భూపాలం నిశ్చతార్థం గురించి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు అంతా సందడిగానే ఉన్నాయి. అంతేకాకుండా తనకు ప్రపోజ్ చేసింది ఉద్బవ్ రఘునందన్ అని, తాను కూడా ఓకే చెప్పానని పోస్ట్ చేసేసరికి అందరూ నిజమేనని నమ్మారు.
 
ఇదంతా ఓ వెబ్ చిత్రం పబ్లిసిటీ కోసమేనట. తాజాగా పునర్నవి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుతో మరింత స్పష్టత వచ్చింది. ఉద్బవ్ రఘునందన్, పునర్నవి ప్రధాన పాత్రలో నటించిన కమిట్మెంట్ అనే వెబ్ చిత్రం ఆహా యాప్‌లో నవంబరు 13న విడుదల కానుంది. దీనిపై పునర్నవి స్పందిస్తూ అంతా తప్పలేక ఒప్పుకున్నానని తెలిపారు.
మీరు కూడా వీలుపడితే మాతో జాయిన్ అవ్వండి అని తెలిపారు. మొత్తంమీద తన వెబ్ ఫిల్మ్‌కు పబ్లిసిటీ పెరిగిందన్నారు. ఇందులో రాహుల్ సిప్లిగంజ్ కూడా పాత్ర పోషిస్తున్నాడు. పునర్నవి పెళ్లి, నిశ్చితార్థం అనగానే తనవంతు వైరాగ్యపు పోస్ట్‌తో సీన్‌ను పండించాడని పునర్నవి తెలిపారు.
 

Tappaleka oppokunanu. Inka mundu undi asalaina crazy ride!

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు