ప్రముఖ సినీ పాత్రికేయుడు, నిర్మాత, సూపర్ హిట్ ఫిలిం పత్రిక, ఇండస్ట్రీహిట్.కామ్ అధినేత బి ఏ రాజు ఈ రోజు 21- 05- 2021 శుక్రవారం రాత్రి 07:56 గంటలకు హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు కుమారులు అరుణ్ కుమార్, శివ కుమార్ ఉన్నారు. ఆయన సతీమణి ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు,కాలమిస్ట్ , దర్శకురాలు కలిదిండి జయ రెండు సంవత్సరాల క్రితం మరణించారు. కాగా బి ఏ రాజు మరణం పట్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. బి..రాజు భౌతికకాయాన్ని
ఈరోజు మధ్యాహ్నం 11గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్తానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పరిమిత సభ్యులతోనే అనుమతి లభించింది. హీరో శ్రీకాంత్ ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. చివరిసారిగా ఆయన్ను చూడలేకపోయామని సినీ పాత్రికేయులు, సినీ ప్రముఖులు బాధను వ్యక్తం చేస్తున్నారు.