ఈ సంధర్భంగా వెంకయ్య నాయుడుగారు మాట్లాడుతూ.. ఈ రోజు అరి ప్రచార చిత్రాన్ని వీక్షించడం జరిగింది. చాలా సంతోషం. ఒక చక్కని ఇతివృత్తం, సందేశంతో కూడిన సినిమాను తీయాలని సంకల్పించడం చాలా అభినందనీయం. మన పూర్వీకులు చెబుతుండేవారు.. ఈ అరిషడ్వర్గాలంటే. కామ, క్రోధ, లోభ, మధ మాత్సర్యాలు. ఇవన్నీ లోపల ఉండే శతృవులు. వాటిని మనం జయించగలిగితే.. జీవితం సుఖంగా ఉంటుంది. మన చుట్టుపక్కల ఉండేవారు కూడా సుఖంగా ఉంటారు అని పెద్దవాళ్లు చెప్పారు. అలాంటి ఇతివృత్తంలో ఈ చిత్రం నిర్మించడం చాలా సంతోషం. సమాజానికి ఉపయోగపడేలా, సందేశంతో కూడిన చిత్రంగా సినిమాను తీయగలిగితే.. అది ప్రజల మెప్పు పొందుతుంది. ఆ సందేశం ప్రజల మనస్సుల్లో నాటుకుపోతుంది. ఆ దిశగా మీరు చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతం అవుతుందని విశ్వసిస్తూ.. మంచి నేపథ్యాన్ని ఎంచుకున్న రచయిత, దర్శకుడు, నిర్మాత, నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. అన్నారు.