''అత్తారింటికి దారేది'' సినిమాల్లో నటించి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన 90టీస్ గ్లామర్ తార నదియాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓల్డ్ లేడీ అని పిలుస్తారట. అలా త్రివిక్రమ్ ఎందుకు పిలుస్తాడోననే సందేహం అందరిలో ఉన్నది. ఆ డౌట్ మీలోనూ ఉంటే ఈ స్టోరీ చదవండి. త్రివిక్రమ్ నదియాకు సెకండ్ ఇన్నింగ్స్‌కు ప్రధాన కారణమయ్యాడు. ఒకప్పుడు సూపర్ హీరోయిన్గా పేరు తెచ్చిన నదియా నటనకు మంచి స్కోప్ ఉందనే రెండో ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టాడు.
త్రివిక్రమ్ అలా పిలవడంలో ఒక కారణం ఉందట. నదియా మంచి టాలెంట్ ఉన్న నటి కావడంతో ఆమె తనకు 80 సంవత్సరాలు వయస్సు వచ్చే వరకు సినిమాలలో నటిస్తూనే ఉండాలనే కోరికతో తాను అలా నదియాను ‘ఓల్డ్ లేడీ’ అని అభిమానంగా పిలుస్తున్నాను అని చెప్పి షాక్ ఇచ్చాడట. మరి నదియాకు 80 ఏళ్ల వరకు సినిమా ఛాన్సులు ఎవరిస్తారనేది వేచి చూడాలి.