హీరో రామ్‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.. ఎందుకంటే?

బుధవారం, 13 జనవరి 2021 (08:51 IST)
హీరో రామ్‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం అతను నటిస్తున్న రెడ్ సినిమా బృందంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు సంగతేంటంటే..? స్మార్ట్ శంకర్ చిత్రంతో ఫుల్ ఫాంలోకి వచ్చిన రామ్ ప్రస్తుతం రెడ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. 
 
తడ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 14న థియేటర్స్‌లోకి రానుంది. ఈ సందర్భంగా గత రాత్రి చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామ్, స్రవంతి రవికిషోర్, కిషోర్ తిరుమలతో పాటు త్రివిక్రమ్ కూడా హాజరయ్యారు.
 
స్వయంవరం చిత్రం తర్వాత తనకు ఆఫర్స్ రాకపోవడంతో నాకు ఫోన్ చేసిన పిలించి నాతో నువ్వే కావాలి రాయించారు. ఈ విషయంలో రవికిషోర్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అని ఎమోషనల్‌గా మాట్లాడారు త్రివిక్రమ్. ఆ తర్వాత రవికిషోర్ కాళ్లు కూడా పట్టుకున్నాడు. ఇది చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. 
 
అయితే చివరిగా టికెట్ ప్రదర్శన సమయంలో చిత్ర బృందం పెద్ద తప్పు చేసింది. రెడ్ టికెట్ కు బదులు క్రాక్ సినిమా టికెట్ ప్రదర్శించింది. ఆ మాత్రం కూడా చూసుకోకుండా ఫొటోలకు ఫోజులు ఎలా ఇస్తారు అంటూ నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు