కానీ, తాజాగా ఈరోజు ఉపాసన ఉద్యోగస్తులైన మహిళలకోసం ప్రత్యేకంగా చిట్కాలను తెలియజేసింది. ఐదు ఎక్సర్ సైజ్‌లు, భంగిమలను కూర్చొని ఎలా చేయవచ్చో తెలియజేస్తూ తన సోషల్‌మీడియాలో పెట్టింది. కంటప్యూలర్ ఉద్యోగిణులు కానీ ఇతర ఉద్యోగాలలో కుర్చీని కూర్చుని వున్నవారు ఇవి తప్పకుండా పాటిస్తే ఎటువంటి నొప్పులు రావనీ, సైడ్ ఎఫెక్ట్‌లేని ఎక్సర్ సైజ్ అంటూ చెబుతోంది.
ముందుగా నెక్ ఎక్సర్ సైజ్‌ను చూపిస్తూ, రెండు చేతులు బల్లపై పెట్టి మెడను ఎలా పైకి కిందకు నెమ్మదిగా కదపాలో చూపించింది. అదేవిధంగా కాళ్లు చేతులతో చిన్నపాటి వ్యాయామాలు ఇలా చేయాలని చెప్పింది. ఈ పోస్ట్ పెట్టి గంటలోనే మంచి స్పందన వచ్చింది. సో. ఇంకేం మహిళలు బీ రెడీ.