అనంతరం ఆమె మాట్లాడుతూ, ఈ రకంగా వచ్చిన ఆదాయాన్ని దోమకొండ ఫోర్ట్ అండ్ విలేజ్ డెవలప్మెంట్ ట్రస్ట్ (DFVDT) దాని కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నా. అణగారిన, అట్టడుగున ఉన్న మహిళలను సమగ్రంగా ఉద్ధరించే ఇతర కార్యక్రమాలతోపాటు ఆర్థిక స్థిరత్వం, మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి ఆ ట్రస్ట్ కట్టుబడి ఉంది. అందుకే వారు చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతు తెలిపాను అని అన్నారు. ఆమె దాతృత్వం ఇతరులకు స్ఫూర్తినిస్తుంది.