పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత అంటే రెండేళ్ల విరామం తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ ఆశలే ఉన్నాయి. పైగా, ఈ చిత్రానికి ముందు ఆయన నటించిన 'అజ్ఞాతవాసి' చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది.
హిందీలో హిట్టయిన "పింక్" చిత్రాన్ని తెలుగులో 'వకీల్ సాబ్' పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. దీంట్లో పవన్ లాయర్ పాత్ర పోషిస్తున్నారు. దీనికి వేణు శ్రీరామ్ దర్శకుడు. దిల్ రాజు నిర్మాత కాగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు. మే నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది.