అమెజాన్ ప్రైమ్‌లో విజయ్ "వారసుడు" స్ట్రీమింగ్

బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (13:34 IST)
తమిళ అగ్రహీరో విజయ్ నటించిన కొత్త చిత్రం "వారసుడు". సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రష్మిక మందన్నా హీరోయిన్. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. తమిళంలో జనవరి 12వ తేదీన, తెలుగులో జనవరి 14వ తేదీన విడుదలైంది. శరత్ కుమార్, శ్రీకాంత్, శ్యామ్, రాధిక శరత్ కుమార్, సంగీత తదితరులు నటించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. 
 
ఈ చిత్రం ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తుంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, విజయ్‌కు ఉత్తరాదిలో కూడా మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండటంతో అక్కడి ప్రేక్షకులు కూడా హిందీలో స్ట్రీమింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు