'పాప ఆగవే' అంటూ మెలోడియస్ ట్యూన్‌తో సాగిపోతున్న ఈ పాట యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తోంది. ఓ ప్రేమికుడు తన ప్రేయసిపై ఉన్న ఫీలింగ్స్ బయటపెడుతూ 'వదలనే వదలనే నిన్నే నేను వదలనే' అంటూ చెప్పిన లైన్‌కి ప్రేమికులు ఫిదా అవుతున్నారు. ఈ పాటకు భాస్కర భట్ల లిరిక్స్ రాయగా.. కారుణ్య ఆలపించారు. సాయి కార్తీక్ అందించిన సంగీతంతో పాటు హీరోహీరోయిన్స్ ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్ లతో షూట్ చేసిన రొమాంటిక్ సీన్స్ ఈ పాటలో హైలైట్ అయ్యాయి.
విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతి రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ 'తీస్ మార్ ఖాన్' సినిమా నిర్మిస్తున్నారు. 'నాటకం' ఫేమ్ కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్ జంటగా నటిస్తున్నారు. సునీల్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లాన్స్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకోగా.. తాజాగా విడుదలైన సాంగ్ సినిమాపై హైప్ పెంచేసింది. పోస్ట్ ప్రొడక్షన్ చివరిదశకు చేరుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
నటీనటులు: ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్, సునీల్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్, పూర్ణ