సైరాతో సై అంటున్న వెంకీ మామ...

బుధవారం, 31 జులై 2019 (22:02 IST)
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. ఈ చిత్రానికి స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పైన రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్న ఈ సంచ‌ల‌న చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. 
 
అయితే... ఇప్పుడు ఈ సినిమాకి పోటీగా వెంకీ మామ సై అంటున్నాడ‌ట‌. విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ క్రేజీ మూవీ వెంకీ మామ‌. జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ శివార్లో వేసిన తిర‌నాళ్ల సెట్టింగ్ లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. 
 
ఈ తిరునాళ్ల‌లో వెంకీ, చైతు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నార‌ట‌. వీరితో పాటు ఐదు వంద‌ల మంది జూనియ‌ర్ ఆర్టిస్టులు పాల్గొంటున్న స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నార‌ని తెలిసింది. ఈ తిరునాళ్ల‌లో మామఅల్లుడు క‌లిసి ఫైట్ కూడా చేయాల్సివ‌స్తుంద‌ట‌. ఈ ఫైట్ ను రామ‌ల‌క్ష్మ‌ణ్ ఆధ్వ‌ర్యంలో చిత్రీక‌రించ‌నున్నార‌ని స‌మాచారం. 
 
అయితే.. ఈ సినిమాని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 4న రిలీజ్ చేసందుకు ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇదే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్. ఎందుకంటే...ఓ పెద్ద సినిమా వ‌స్తుంది అంటే వారం రోజుల గ్యాప్ త‌ర్వాతే మ‌రో పెద్ద సినిమాని రిలీజ్ చేస్తుంటారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ద‌గ్గ‌ర‌లో వేరే సినిమాని రిలీజ్ చేయ‌డానికి ట్రై చేయ‌రు. అయితే... రెండు రోజుల గ్యాప్ లోనే వెంకీ మామ వ‌స్తుండ‌డం విశేషం. మ‌రి..ఇదే క‌నుక జ‌రిగితే...బాక్సాఫీస్ వ‌ద్ద వార్ ఎలా ఉంటుందో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు